వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఎందుకొచ్చాయో అర్థం కాలేదు.. అంబటి ఆవేదన
- ఇంత ఘోరంగా ఓడిపోతామని ఊహించలేదన్న అంబటి
- కూటమికి 164 సీట్లు రావడం వెనక ఏమైనా మాయ ఉందా? అని అనుమానం వ్యక్తం చేసిన మాజీ మంత్రి
- ఏది ఏమైనా ఓటమిని అంగీకరించాల్సిందేనన్న వైసీపీ నేత
వైసీపీకి 11 సీట్లు ఎందుకొచ్చాయో తమకు అర్థం కాలేదని, అలాగే కూటమికి 164 సీట్లు ఎందుకొచ్చాయో వారికీ అర్థం కాలేదని అంబటి పేర్కొన్నారు. కేవలం ఇద్దరు ముగ్గురు కలవడం వల్లే అన్ని సీట్లు వచ్చాయా? లేదంటే వైసీపీపై తెలియని వ్యతిరేకత ఏమైనా ఉందా? లేకపోతే ఇంకేమైనా మాయ జరిగిందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఓడిపోయామని అన్నారు. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగానే కరణం ధర్మశ్రీని జగన్ అనకాపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించారని అంబటి పేర్కొన్నారు.