గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలనడంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ నిరసన

Congress protest for bandi sanjay comments on Gaddar
  • సిద్ధాంతం కోసం పని చేసిన నాయకులను గద్దర్ చంపించారని ఆరోపణ
  • మంత్రి శ్రీధర్ బాబు తండ్రిని కూడా నక్సలైట్లు హత్య చేశారన్న బండి సంజయ్
  • గద్దర్‌కు పద్మ అవార్డు వస్తుందని ఎలా భావించారని ప్రశ్న
  • బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం
  • దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలన్న అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి, బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వైపు బయలుదేరారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బండి సంజయ్ ఏమన్నారంటే?

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో ఒక్కరికీ అవార్డు ప్రకటించలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పద్మ అవార్డుల ప్రకటనలో కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతల విమర్శలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. గద్దర్ వంటి వారిని సిఫార్సు చేశారని, అలాంటి వారికి పద్మ అవార్డు వస్తుందని ఎలా భావించారని ప్రశ్నించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన బీజేపీ కార్యకర్తలను హత్య చేయించారని ఆరోపించారు. గద్దర్ మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, కానీ కానీ నక్సలైట్లు చాలామందిని చంపేశారన్నారు. బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ నేతలను కూడా హత్య చేశారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రిని, ఎంపీ డీకే అరుణ తండ్రిని కూడా నక్సలైట్లు హత్య చేశారన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను చంపిన సమయంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీలో లేరన్నారు. గద్దర్ అవార్డులకూ బీజేపీ వ్యతిరేకమని, మా వాళ్లు ఈ అవార్డును తీసుకోరన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Telangana
Gaddar

More Telugu News