'ఇండిగో' తీరుపై మంచు లక్ష్మి మండిపాటు
- ఇండిగో విమాన సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారన్న మంచు లక్ష్మి
- వాళ్లు చెప్పిన విధంగా చేయనిపక్షంలో గోవాలోనే తన సామగ్రిని వదిలేస్తామని బెదిరించారని వెల్లడి
- ఇదొక రకమైన వేధింపు అంటూ వాపోయిన నటి
"నా లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పిన విధంగా చేయనిపక్షంలో గోవాలోనే నా సామగ్రిని వదిలేస్తామని బెదిరించారు. నాతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్టలేదు. ఇదొక రకమైన వేధింపు. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు" అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.