భోగాపురంలో రేపు ఎయిర్ పోర్ట్ ప్రారంభించనున్న మోదీ... ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
- తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
- థింసా నృత్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాలని సూచన
- ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకాలని దిశానిర్దేశం
విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రేపు (ఆగస్టు 1) ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయ పనుల పురోగతిపై ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, గిరిజన సంప్రదాయ నృత్యమైన 'థింసా'ను కళ్లుచెదిరే స్థాయిలో నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానికి అత్యంత ఘనంగా స్వాగతం పలకాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.