Advertisement

'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమానికి విశేష స్పందన.. శ్రేణులను అభినందించిన లోకేశ్

Nara Lokesh applauds cadre as Intintiki TDP program receives huge response
  • 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం ఐదో రోజూ విజయవంతం
  • 5 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి నేతలు
  • రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ
  • కార్యకర్తలను వ్యక్తిగతంగా అభినందిస్తూ ప్రోత్సహిస్తున్న మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఐదో రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం ద్వారా కూటమి నాయకులు, కార్యకర్తలు గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలను నేరుగా కలిశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ కార్యక్రమం కింద శుక్రవారం ఒక్కరోజే కూటమి శ్రేణులు సుమారు 2.80 లక్షల ఇళ్లను సందర్శించాయి. ఇంటింటికీ వెళ్తున్న నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకుంటున్నారని టీడీపీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో పాటు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.

శ్రేణులను ప్రోత్సహిస్తున్న మంత్రి నారా లోకేశ్

"ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం పురోగతిని మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొంటూ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నాయకులు, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. కొందరికి వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ, మరికొందరితో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. 

పార్టీ శ్రేణులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరుకుని ప్రభుత్వ విజయాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా వివరించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు.
Advertisement
Nara Lokesh
Intintiki TDP Program
Telugu Desam Party
Andhra Pradesh Welfare Schemes
TDP Cadre Appreciation
AP Government Development

More Telugu News