యడ్యూరప్ప బెయిల్ పొడిగించిన కర్ణాటక హైకోర్టు

Karnataka High Court extends bail to Yediyurappa
  • 17 ఏళ్ల అమ్మాయిని వేధించిన ఘటనలో యడ్యూరప్పపై పోక్సో కేసు
  • ట్రయల్ కోర్టు హాజరు నుంచి యడ్యూరప్పకు హైకోర్టు మినహాయింపు
  • కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ ను కర్ణాటక హైకోర్టు పొడిగించింది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. యడ్యూరప్పకు బెయిల్ పొడిగిస్తూ, ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. 

2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో తన 17 ఏళ్ల కూతురుని యడ్యూరప్ప వేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. ఫిర్యాదు చేసిన మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించింది. కాగా యడ్యూరప్పను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని కోరుతూ బాధితురాలి సోదరుడు జూన్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
Go Back to Shorts
Yediyurappa
Karnataka
BJP

More Telugu News