రష్యా బీచ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురి మృతి.. వీడియో ఇదిగో!
- మరో 40 మందికి గాయాలు
- పౌరులే లక్ష్యంగా ఉక్రెయిన్ ఉగ్రదాడికి పాల్పడిందన్న రష్యా
- రష్యా వైమానిక వ్యవస్థ వల్లే ప్రమాదం జరిగిందన్న ఉక్రెయిన్
రష్యాలోని నల్లసముద్ర తీరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతంపై డ్రోన్ దాడి జరగడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు. క్రాస్నోడర్ రీజియన్‌లోని ఆర్ఖిపో-ఓసిపోవ్కా బీచ్‌లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది.
స్థానిక అధికారుల ప్రకారం, క్షతగాత్రులలో 21 మందిని ఆసుపత్రికి తరలించారు. డ్రోన్ బీచ్ వైపు దూసుకురావడం, పెద్ద శబ్దంతో పేలిపోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. పేలుడుకు ముందు గాలిలో కాల్పుల శబ్దం వినిపించిందని, రష్యా వైమానిక దళాలు డ్రోన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ దాడి ఉక్రెయిన్ పనేనని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. పౌరులే లక్ష్యంగా ఉక్రెయిన్ ఉగ్రవాద వ్యూహాలను అనుసరిస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థే డ్రోన్‌ను జనావాసాల మధ్య కూల్చివేయడం వల్ల పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధికారి ఆండ్రీ కోవెలెంకో తెలిపారు. తమ లక్ష్యం రష్యా సైనిక, పారిశ్రామిక స్థావరాలే తప్ప పౌరులు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలు, నౌకా స్థావరాలపై డ్రోన్ దాడులు పెరిగాయి. తాజా ఘటనతో యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోని పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక బృందాలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.