విశ్రాంతి తీసుకుంటున్న తారక్.. నాన్ స్టాప్ గా జరుగుతున్న 'డ్రాగన్' షూటింగ్

Jr NTR takes rest while Dragon movie shooting continues non stop
  • షూటింగ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కు గాయం
  • మరో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్న తారక్
  • ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న చిత్ర బృందం

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుతుండగా, మరో రెండు వారాల పాటు ఆయన షూటింగ్‌కు దూరంగానే ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి.


హీరో అందుబాటులో లేనప్పటికీ ఆయన నటిస్తున్న 'డ్రాగన్' చిత్ర బృందం పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ముందడుగు వేస్తోంది. సమయం వృథా కాకుండా నాన్-స్టాప్ షూటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఆయన పూర్తి కోలుకుని సెట్స్‌లో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు.


కాగా, ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుసగా నటీనటులు గాయపడటం అభిమానులను కలవరపెడుతోంది. ఇటీవల సీనియర్ బాలకృష్ణ, రష్మిక మందన్న, రామ్ చరణ్ కూడా గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement
Jr NTR
Dragon Movie
Jr NTR Injury
Tollywood News
Dragon Shooting Update
Junior NTR

More Telugu News