మధ్యలో ఆకలి వేస్తోందా? డాక్టర్ చెప్పిన ఏడు ఆరోగ్యకరమైన స్నాక్స్
- తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారానికే ప్రాధాన్యం
- జాబితాలో ఎడామామే, వేరుశెనగలు
- గింజల మిశ్రమం, మఖానా మంచి ఎంపిక
- నిమ్మరసంతో వేయించిన శనగలు ఉపయోగకరం
- ఓవర్‌నైట్ ఓట్స్ తీసుకోవాలని సూచన
- తక్కువ నూనెతో చేసిన పాప్‌కార్న్ కూడా మంచిదే
భోజనం మధ్యలో ఆకలి వేయడం సహజమే. అలాంటి సమయంలో ఏది పడితే అది తినడం కంటే పోషకాలున్న ఆహారం తీసుకోవాలని క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ వర్తికా విష్వానీ సూచిస్తున్నారు. తాను తరచూ తీసుకునే ఏడు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. తక్కువ ప్రాసెస్ చేసిన, పోషకాలతో నిండిన ఆహారమే రోజువారీ స్నాకింగ్‌కు సరైన ఎంపిక అని తెలిపారు.
ఇంట్లో చేసిన మసాలా పల్లీలు
పల్లీల్లో మంచి కొవ్వులు, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేస్తే అదనపు చక్కెర, నిల్వ పదార్థాలు ఉండవు. మితంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడతాయి.
వేయించిన గింజల మిశ్రమం
గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసె గింజల వంటి వాటిలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, మెగ్నీషియం, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మఖానా
వేయించిన మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్, పీచు ఎక్కువగా లభిస్తాయి. బరువు నియంత్రణకు తోడ్పడతాయి. శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి.
లేత సోయాబీన్స్
వేయించిన లేత సోయాబీన్స్‌లో మొక్కల ఆధారిత ప్రొటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతాయి. శరీరానికి అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కూడా అందిస్తాయి.
నిమ్మరసంతో శనగలు
శనగల్లో ప్రొటీన్, పీచు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సాయపడతాయి. నిమ్మరసం కలపడం వల్ల విటమిన్-సి కూడా లభిస్తుంది.
ఓవర్‌నైట్ ఓట్స్
రాత్రంతా నానబెట్టిన రోల్డ్ ఓట్స్‌లో చక్కెర లేని కోకో పొడి, ఖర్జూరాలు కలిపి తీసుకోవాలని సూచించారు. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
పాప్‌కార్న్
నూనె, వెన్న ఎక్కువగా లేకుండా తయారు చేసిన పాప్‌కార్న్ మంచి స్నాక్‌గా పనిచేస్తుంది. ఇందులో పీచు ఎక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది.
గమనిక: ఈ సూచనలు సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. ఆహారంలో మార్పులు చేసేముందు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.