చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన ఆర్.కృష్ణయ్య
- చంద్రబాబు విజన్ ఉన్న నేత అని కొనియాడిన కృష్ణయ్య
- పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని కితాబు
- విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. మోదీకి నీరాజనం పలికేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖ అభివృద్ధికి కావాల్సిన చర్యలను ప్రధాని తీసుకుంటారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.