ప్రియాంకాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి
- ప్రియాంకాగాంధీపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
- బీజేపీ కార్యాలయంపై రాళ్లు రువ్విన కాంగ్రెస్ శ్రేణులు
- బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయం
ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం లోపల నుంచి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేయగా... బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయమయింది. ఈ క్రమంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.