ప్రియాంక గాంధీ గెలుపుపై స్పందించిన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్
- వయనాడ్ నుంచి 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన ప్రియాంకగాంధీ
- ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచించి ఓటేస్తారని భావించానన్న నవ్య హరిదాస్
- దురదృష్టవశాత్తూ బీజేపీ గెలవలేదన్న నవ్య హరిదాస్
వయనాడ్లో ఓటమిపై నవ్య హరిదాస్ స్పందించారు. అభివృద్ధి గురించి ఆలోచించి ప్రజలు ఓటేస్తారని తాము భావించామని, కానీ పోలింగ్ శాతం తక్కువగా నమోదైందన్నారు. తమను గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్పామన్నారు. కానీ బీజేపీ గెలవలేదన్నారు.
వయనాడ్లో విద్య, వ్యవసాయ, మెడిసిన్... ఇలా అన్ని రంగాలు కూడా వెనుకబడ్డాయన్నారు. ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు ప్రియాంకను గెలిపించినా ఆమె అప్పుడప్పుడు వస్తారని అభిప్రాయపడ్డారు.