మహారాష్ట్రలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారీటీ.. 194 సీట్లలో లీడ్
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కొనసాగుతున్న ట్రెండ్
- మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే
- ముఖ్యమంత్రీ సీటు కోసం కూటమి నేతల మధ్య పోటీ
ఆయా పార్టీల్లో కిందిస్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం స్పందిస్తూ.. ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చుని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా, శనివారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీయే కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. బారామతిలో పవార్ కుటుంబ పోటీలో అజిత్ ముందున్నారు.