పడిపోతున్న బంగారం ధరలు.. 4 నుంచి ఇప్పటి వరకు ఎంత తగ్గిందంటే..!
- పది రోజుల్లో రూ. 4,750 క్షీణించిన పసిడి ధర
- ట్రంప్ ఎన్నిక తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్న పుత్తడి ధరలు
- కొనుగోలుకు ఇదే మంచి సమయమంటున్న మార్కెట్ నిపుణులు
బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని నేషనల్ ఇండియా బులియన్ అండ్ జెవెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) కార్యదర్శి సురేంద్రమెహతా తెలిపారు. అమెరికా ఆర్థిక వృద్ధికి ట్రంప్ కనుక చర్యలు తీసుకుంటే బంగారం ధరల తగ్గుదల స్థిరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో నిన్న 10 గ్రాముల బంగారంపై రూ.700 తగ్గి రూ. 77 వేల స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధరపై రూ.1200 తగ్గి రూ. 75,650గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1100 తగ్గి రూ. 70 వేల దిగువకు పడిపోయింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రూ. 69,350గా రికార్డయింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ. 2,310 తగ్గి రూ. 90,190కి దిగొచ్చింది. అదే సమయంలో హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ. 2 వేలు తగ్గి రూ. 99 వేలుగా నమోదైంది.