సినీ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
- 84 ఎకరాల భూమిని కాజేసేందుకు యత్నించిన శివరామకృష్ణ
- 2003లోనే కోర్టులో కేసు వేసిన ఆనాటి ప్రభుత్వం
- శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చిన సుప్రీంకోర్టు
ఈ స్థలం గొడవపై 2003లోనే ఆనాటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు శివరామకృష్ణవి నకిలీ పత్రాలేనని తేల్చింది. ఈ నేపథ్యంలో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగంగౌడ్ పై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామకృష్ణ గతంలో రవితేజతో 'దరువు' సినిమాతో పాటు పలు చిత్రాలను నిర్మించారు.