అడ్వాన్స్ బుకింగ్ గడువు తగ్గించడంపై రైల్వే శాఖ వివరణ
- అడ్వాన్స్ బుకింగ్ గడువు ఎక్కువ రోజులు ఉండటంతో క్యాన్సిలేషన్లు ఎక్కువగా ఉంటున్నాయన్న రైల్వే శాఖ
- సీట్లను బ్లాక్ చేసుకునే అవకాశం తగ్గుతుందని వివరణ
- 60 రోజుల గడువు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించామన్న రైల్వే బోర్డు
అంతే కాకుండా పలు రకాల మోసాలు, రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకోవడం వంటి ఘటనలకు కారణమవుతోందని పేర్కొంది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ముందుగానే సీట్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటోందని వెల్లడించింది. ప్రస్తుత నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చని రైల్వే బోర్డు వెల్లడించింది. తక్కువ గడువు ఉంటే నిజమైన ప్రయాణికులకు అనువుగా ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల డిమాండ్ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖకు వీలుగా ఉంటుందని తెలిపింది. ముందస్తు బుకింగ్‌కు 60 రోజుల గడువు ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.