చంద్రబాబు వచ్చే సమయంలో కూడా భక్తులకు దర్శనాన్ని ఆపబోము: అనిత
- కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనిత
- భవానీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
- పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి
భవానీ మాల వేసుకున్న భక్తులకు ప్రత్యేకమైన క్యూలైన్ ఏర్పాటు చేయబోతున్నామని అనిత తెలిపారు. అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. సీఎం వచ్చే సమయంలో కూడా భక్తులకు దర్శనాన్ని నిలుపదల చేయబోమని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారని... ఆయన వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని చెప్పారు.