సేమ్‌ లుక్‌లో కనిపించిన అక్కినేని హీరోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సేమ్‌ లుక్‌లో కనిపించిన అక్కినేని హీరోలు

Akkineni heroes  appeared in the same look
  • ఏఎన్నార్‌ శతజయంతి వేడుకలో ఆకర్షణగా అక్కినేని హీరోల లుక్స్‌ 
  • విలన్‌ పాత్ర కోసం నాగార్జున కొత్త లుక్‌ 
  • తండేల్‌ లుక్‌లో నాగచైతన్య
సాధారణంగా మన కథానాయకులు సినిమాల్లో క్యారెక్టర్స్‌ మేకోవర్‌ కోసం బాడీ మేకోవర్‌తో పాటు సదరు పాత్ర డిమాండ్‌ను బట్టి డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తుంటారు. ఆ సినిమా పూర్తయ్యే వరకు అదే లుక్‌ను మెయింటైన్‌ చేస్తుంటారు. సదరు సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్‌ విరామ సమయంలో బయటికొచ్చినా అదే లుక్‌లో వుంటారు. ఈ రోజు ( శుక్రవారం) జరిగిన లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలో ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే లుక్‌లో.. అంటే గుబురు గడ్డం, లాంగ్‌ హెయిర్‌తో కనిపించారు. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో నాగార్జున సైమన్‌ అనే ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తొలిసారి విలన్‌గా చేస్తున్న నాగార్జున ఆ సినిమాలో కనిపించే గెటప్‌లోనే ఈ రోజు వేడుకకు హాజరయ్యాడు. 

ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కొంత పార్ట్‌ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్‌ వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకు నాగార్జున ఇదే లుక్‌లో వుంటాడు. ఇక నాగచైతన్య ప్రస్తుతం తండేల్‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తను మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ఇందుకోసం గత కొంతకాలంగా చైతన్య ఈ లుక్‌ను మెయింటైన్‌ చేస్తున్నాడు. ఈ వరుసలో అక్కినేని అఖిల్‌ కూడా లాంగ్‌హెయిర్‌, గడ్డంతో కనిపించాడు. అయితే సాధారణంగానే అఖిల్‌ ఎక్కువగా ఈ లుక్‌లోనే వుంటాడు. ఇలా అక్కినేని హీరోలు ఒకే లుక్‌లో కనిపించడం అందర్నీ ఆకర్షించింది. అక్కినేని శతజయంతి వేడుకల్లో ఈ హీరోల లుక్‌ ఓ అదనపు ఆకర్షణగా నిలిచింది.
Advertisement
akkineni nagarjuna
akkineni akhil
akkineni nagachaitanya
Anr 100 years celabrations
Akkineni family

More Telugu News