నా అంత పెద్ద రౌడీ మరెవరూ ఉండరు జాగ్రత్త!... అంటూ యూట్యూబర్‌ను బెదిరించిన మరో యూట్యూబర్
- బెంగళూరులో రౌడీలు వైట్‌ఫీల్డ్‌లోనూ ఉంటారని హెచ్చరిక
- వైరల్ అయిన ఈ వీడియోను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేసిన ఎక్స్ యూజర్లు
- నిందితుడిని దీపక్ గధిగప్పగా గుర్తింపు
వైరల్ అయిన ఈ వీడియోను ఎక్స్ యూజర్లు షేర్ చేస్తూ బెంగళూరు పోలీసులను ట్యాంగ్ చేశారు. ఈ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో మరో వ్యక్తిని బెదిరిస్తున్నాడని, ఇలాంటివి సమాజంలో భయభ్రాంతులకు గురిచేస్తాయని పేర్కొన్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన కడుగోడి పోలీసులు వ్లాగర్‌ను అరెస్ట్ చేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇలాంటి వీడియోలు ఎవరైనా పోస్టు చేస్తే వారికి జైలు కూడు తప్పదని హెచ్చరించారు.