Simbu: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళాలు ప్రకటించిన తమిళ హీరో

Tamil actor Simbu donation to AP and TG
షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్లు భారీ విరాళాలను ప్రకటించి తమ పెద్ద మనసులను చాటుకున్నారు. తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ హీరో శింబు ముందుకొచ్చారు. 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు ఆయన రూ. 6 లక్షల విరాళం అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితిలో కోలీవుడ్ నుంచి స్పందించిన తొలి హీరోగా శింబు నిలిచారు. తెలుగు సినీ ప్రేక్షకులకు శింబు సుపరిచితమే. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.
Go Back to Shorts
Simbu
Kollywood
Tollywood
Floods

More Telugu News