టాప్ 5 సీఎంల జాబితాలో చంద్రబాబు
- ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే
- తొలి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఐదో స్థానంలో చంద్రబాబు
- నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్
అత్యంత జనాదరణ పొందిన సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. సీఎంగా బాధ్యతలను చేపట్టిన రెండు నెలల సమయంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల జాబితాలోకి చంద్రబాబు రావడం విశేషం.