తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా మనుసింఘ్వీ... సీఎల్పీ తీర్మానం
- గచ్చిబౌలిలోని హోటల్ షెరాటన్ లో సీఎల్పీ సమావేశం
- హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అభిషేక్ మనుసింఘ్వీ
- రేపు నామినేషన్ దాఖలు చేయనున్న మనుసింఘ్వీ
మనుసింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేటి సీఎల్పీ భేటీలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో, మనుసింఘ్వీ సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ సీఎల్పీ సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి... మనుసింఘ్వీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.