Padi Kaushik Reddy: పంజాగుట్ట చౌరస్తాలో దానం నాగేందర్ బీడీలు అమ్ముకునేవాడని రేవంత్ రెడ్డే చెప్పాడు: పాడి కౌశిక్ రెడ్డి

BRS MLA Padi Kaushik Reddy fires on Danam Nagendar
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారంటూ ఆ పార్టీ నాయకత్వంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో విలువ ఉండదని గ్రహించే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నారని దానం వివరించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికీ విలువ ఉంటుందని అన్నారు. 

దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. త్వరలో నీ అక్రమాలు బయటపెడతాం అంటూ దానం నాగేందర్ పై మండిపడ్డారు. బీడీలు అమ్ముకునే నువ్వు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు? అని ప్రశ్నించారు. పంజాగుట్ట చౌరస్తాలో దానం నాగేందర్ బీడీలు అమ్ముకునేవాడని రేవంత్ రెడ్డే చెప్పాడని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. బీడీలు అమ్ముకునే నువ్వు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు? నీ బాధితులు చాలామంది నా వద్దకు వచ్చారు అని తెలిపారు. 

"దానం నాగేందర్ గారూ... నేను చెప్పిన మాటలు కావు ఇవి. మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నిన్ను ఏమని తిట్టారో తెలుసా? నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం ఏమైనా ఉన్నాయా? ఇవాళ హైదరాబాద్ లో నీకంటే హెరాస్ మెంట్ చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారా? నీ అవినీతి, అక్రమాలు అన్నీ త్వరలోనే బయటపెడతాం. నీ అక్రమ సంపాదనను కచ్చితంగా బయటపెడతాం. 

నీకు అంత రోషం ఉంటే... కేసీఆర్, కేటీఆర్ పెట్టిన భిక్ష అయిన నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయొచ్చు కదా! నీకంత దమ్ము ఉందా? ఎందుకు భయపడుతున్నావ్? నువ్వు మగాడివే అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. దానం నాగేందర్ తో పాటు పార్టీ వదిలి వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయండి... మీ సంగతేంటో ప్రజలే చెబుతారు" అంటూ పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
Go Back to Shorts
Padi Kaushik Reddy
Danam Nagender
BRS
Congress
Revanth Reddy
Telangana

More Telugu News