ప్రపంచకప్ విజయం అనంతరం రోహిత్ కంట ఆనంద భాష్పాలు
- విజయం అనంతరం రోహిత్‌ను అల్లుకుపోయిన భార్య రితికా
- భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయిన కెప్టెన్
- ఆనందంతో కంట కన్నీరు
ఈ టోర్నీలో రోహిత్ అద్భుత ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించాడు. 36.71 సగటు, 156.70 స్ట్రైక్‌రేట్‌తో 257 పరుగులు చేశాడు. అయితే, కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.