ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్.. మైదానంలోకి పోలీసుల ఎంట్రీ
- భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని
- హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకున్న ఫ్యాన్.. మైదానంలోకి దూసుకొచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అభిమాని పట్ల కఠినంగా వ్యవహరించొద్దని సూచించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
కాగా న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ 60 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయ 40 పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా బౌలింగ్‌లో మెరిశాడు. 2 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇతర బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడడానికి ముందు సాధించిన ఈ విజయం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపనుంది.