ఆ పాట అంత హిట్ అవుతుందని అనుకోలేదు: 'ఓం భీమ్ బుష్' మనీశ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పాట అంత హిట్ అవుతుందని అనుకోలేదు: 'ఓం భీమ్ బుష్' మనీశ్ కుమార్

Maneesh Kumar Interview
  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'ఓం భీమ్ బుష్'
  • దెయ్యం పాత్రలో మెప్పించిన మనీశ్ కుమార్ 
  • వరుస అవకాశాలు వస్తున్నాయని వెల్లడి 
  • సరైన పాత్రల కోసం వెయిట్ చేస్తున్నానని వ్యాఖ్య
'ఓం భీమ్ బుష్' .. హారర్ కామెడీ జోనర్లో రూపొందిన సినిమా ఇది. ఇటీవలే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోయింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో దెయ్యం పాత్రను పోషించిన మనీశ్ కుమార్ కి మంచి పేరు వచ్చింది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీశ్ కుమార్ మాట్లాడాడు. 

"నేను డాన్సర్ నీ .. అనుకోకుండా నాకు ఈ సినిమాలో దెయ్యం పాత్రను పోషించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో దెయ్యం మంచి డాన్సర్ కావడం వలన, ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమాలోని 'అణువణువు అలలెగసే .. తెలియని ఓ ఆనందమే' అనే పాట దెయ్యం పైనే ఉంటుంది. ఈ పాట చాలా పాప్యులర్ అయింది. ఇంత హిట్ అవుతుందని మాత్రం అనుకోలేదు. అర్జిత్ సింగ్ వాయిస్ చేసిన మేజిక్ అది" అని అన్నాడు.

'ఓం భీమ్ బుష్' సినిమా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే ఈ పాట కూడా నా కెరియర్ లో గుర్తుండిపోతుంది. ఈ సినిమా చేసిన దగ్గర నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. నాకు మరింత పేరు తీసుకొచ్చే పాత్రలను ఎంపిక చేసుకుందామని అనుకుంటున్నాను. అలాంటి ప్రాజెకుల కోసమే చూస్తున్నాను" అని చెప్పాడు. 
Advertisement
Manish Kumar
Om Bheem Bush
Sri Vishnu

More Telugu News