మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కావాలి కానీ అభ్యర్థులు వద్దా?: ఖర్గేకు కాంగ్రెస్ నేత ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ లేఖ
- ఎంవీఏ కూటమి తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థినీ నిలబెట్టకపోవడంపై అసంతృప్తి
- 48 సీట్లలో ముస్లింలకు ఒక్క సీటూ కేటాయించలేరా అంటూ ప్రశ్న
- పార్టీ ప్రచార బాధ్యతల నుంచి తప్పుకున్న ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి ముహమ్మద్ ఆరిఫ్ ఈ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ టికెట్ ఆశించినట్లు సమాచారం. ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న ఆరిఫ్ ను పార్టీ పరిగణనలోకి తీసుకోకుండా ముంబై నార్త్ సెంట్రల్ టికెట్ ను వర్షా గైక్వాడ్ కు కేటాయించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆరిఫ్.. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేపట్టలేనని తేల్చి చెప్పారు. పార్టీలో అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం కల్పించాలనే సిద్ధాంతానికి కాంగ్రెస్ దూరమవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ లో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయంపై ఎదురవుతున్న ప్రశ్నలకు బదులివ్వలేకపోతున్నట్లు ఆరిఫ్ చెప్పారు.