'రత్నం’ కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది: హీరో విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రత్నం’ కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది: హీరో విశాల్

Hero Vishal attends Rathnam movie promotions
  • విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా రత్నం
  • హరి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • నేడు ప్రమోషన్ ఈవెంట్ కు హాజరైన విశాల్ 
విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. 

ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో హీరో విశాల్ పాల్గొన్నారు. 

ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో విశాల్ మాట్లాడుతూ... "19 ఏళ్ల నా కెరీర్‌లో మీడియా, ఫ్యాన్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్లందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నరసింహారెడ్డి కాలేజ్‌కు సారీ. అక్కడ ఈవెంట్ పెట్టలేకపోయాం. సక్సెస్ మీట్‌ను అక్కడే నిర్వహిస్తాం. 

మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను. 'వాడు వీడు' టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు.. కానీ నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి. మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు. నేను ఆయన మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని అలా ప్రయత్నిస్తుంటాను. 

హరి గారితో భరణి, పూజ చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి. తాజాగా 'రత్నం' సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. సతీష్ గారు ఈ సినిమాను తీసుకున్నందుకు థాంక్స్. అందరికీ ఈ చిత్రంతో లాభాలు రావాలి. ఏప్రిల్ 26న మా మూవీ రాబోతోంది. నేను చివరి నిమిషం వరకు సినిమాను ప్రమోట్ చేస్తాను. అది నా బాధ్యత. 

మీడియా వల్ల ఈ చిత్రం ఇంతవరకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. 

హరి గారి చిత్రంలో హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది. నేను ఓటు వేశాను. అందరూ ఓటు వేయాలి. కొత్త ఓటర్లు కచ్చితంగా వెళ్లి పోలింగ్‌లో పాల్గొనండి" అని పిలుపునిచ్చారు.
Advertisement
Rathnam
Hero Vishal
Priya Bhavani Shankar
Hari
Kollywood
Tollywood

More Telugu News