చంద్రబాబు నిన్నటి దాకా వాలంటీర్లను ఇష్టం వచ్చినట్టు తిట్టారు: అంబటి రాంబాబు
- నిన్నటి దాకా వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారన్న అంబటి
- ఇప్పుడు వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామంటున్నారని విమర్శ
- చంద్రబాబు ఎమ్మెల్యే కూడా కాలేరని వ్యాఖ్య
ఇక పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏ పేదవాడిని అడిగినా ముఖ్యమంత్రి జగనే అని చెపుతున్నారని... చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పని చేశారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా... ఎమ్మెల్యే కూడా కాలేరని చెప్పారు. చంద్రబాబు ప్రజా నాయకుడు కాదని అన్నారు.