ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రచారం, టీడీపీని వీడడం లేదు: వేమిరెడ్డి స్పష్టీకరణ
- పార్టీ మార్పు ఊహాగానాలను నమ్మవద్దన్న వేమిరెడ్డి
- నెల్లూరు ఎంపీ స్థానం నుంచి తాను, అసెంబ్లీ స్థానం నుంచి ప్రశాంతిరెడ్డి సైకిల్ గుర్తుపై గెలవబోతున్నామన్న నేత
- ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి వైసీపీ తట్టుకోలేకపోతోందన్న ప్రశాంతిరెడ్డి
నెల్లూరులోని తన నివాసంలో నిన్న సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, టీడీపీలోకి వలసలు పోటెత్తుతుండడంతో కొందరు అసూయ పడుతున్నారని ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు.