2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. వరల్డ్ బ్యాంక్ అంచనా
- సేవలు, పారిశ్రామికరంగంలో కార్యకలాపాల జోరు వృద్ధికి ఊతమిస్తుందని విశ్లేషణ
- 2025లో 6.6 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని అంచనా
- దక్షిణాసియా దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించిన వరల్డ్ బ్యాంక్
క్రమంగా ద్రవ్యలోటు తగ్గనుందని, ప్రభుత్వ రుణాలు తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఆర్థిక పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడింది. కాగా దక్షిణాసియాలో మెరుగైన ఆర్థిక వృద్ధి రేటు నమోదవనుందని పేర్కొంది. ఇందుకు భారత్ సాధించే పురోగతి ప్రధాన కారణమని విశ్లేషించింది. రానున్న 2 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంచనా వేసింది. భారత పొరుగుదేశాల విషయానికి వస్తే 2024-25లో బంగ్లాదేశ్ 5.7 శాతం, పాకిస్థాన్ 2.3 శాతం, శ్రీలంక వృద్ధి రేటు 2.5 శాతంగా ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది.