పవన్ కి నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్: అంబటి
- జగన్ ను తొక్కడం పవన్ వల్ల కాదన్న అంబటి
- పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని ఎద్దేవా
- పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడని విమర్శ
పవన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని... ఆయన మంచి నటుడని అంబటి అన్నారు. అయితే ఆయన రాజకీయాలకు పనికిరారని చెప్పారు. పిచ్చిపిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని... పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధ కలిగిందని పవన్ అన్నారని... మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా? అని ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని అడిగారు.