పీనల్ కోడ్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు... జులై 1 నుంచి అమలు
- ఇప్పటివరకు భారత్ లో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల అమలు
- వాటి స్థానంలో మూడు కొత్త చట్టాలకు కేంద్రం రూపకల్పన
- గత పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాలకు ఆమోదం
- రాజముద్ర వేసిన రాష్ట్రపతి ముర్ము
ఈ కొత్త చట్టాల పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య.
ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.
ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించగా, గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేశారు. తాజాగా, కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు.