రాహుల్ గాంధీ బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు: విజయసాయిరెడ్డి

రాహుల్ గాంధీ బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy take a dig at Congress
  • కాంగ్రెస్ కు అగ్రనేతలు దూరమవుతున్నారన్న విజయసాయిరెడ్డి
  • కాంగ్రెస్ పునాదులు ఎప్పుడో కదిలిపోయాయని వ్యాఖ్యలు 
  • ఏపీకి ద్రోహం చేసినప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని వెల్లడి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు వెళ్లిపోతున్నారని, ఇదే వరుసలో రాహుల్ గాంధీ కూడా రేపో మాపో బీజేపీలో చేరినా తానేమీ ఆశ్చర్యపోనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తన పునాదులు కోల్పోయిందని, ఇప్పుడు ఆ పార్టీకి అగ్రనేతలు కూడా దూరమవుతున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఏపీకి ద్రోహం చేసినప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, ఇప్పుడు దేశం అంతా కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోందని పేర్కొన్నారు.
Advertisement
Vijayasai Reddy
Rahul Gandhi
YSRCP
Congress
Andhra Pradesh

More Telugu News