నా జీవితంలో అతిపెద్ద విషాదం అదే: తనికెళ్ల భరణి
- మిత్రుడు దేవరకొండ నరసింహకుమార్ మరణం అత్యంత విషాదకరమన్న భరణి
- తనలో రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది తనేనని వెల్లడి
- వాడి మరణం నుంచి కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టిందని వ్యాఖ్య
"నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది .. అది నా స్నేహితుడి మరణం. 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంటుంది. నా మిత్రుడు దేవరకొండ నరసింహ కుమార్ అని ఉండేవాడు. డిగ్రీ వరకూ ఇద్దరం కలిసే చదువుకున్నాం. తనకి నా కంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది .. మంచి తెలివైనవాడు. అలాంటివాడు ఓ ప్రమాదంలో చనిపోయాడు' అని అన్నారు.
" నాలో ఒక రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది తనే. నన్ను ప్రోత్సహించి రాయిస్తూ ఉండేవాడు. నేను వ్రాసింది చదివి చాలా బాగుందని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. నేను బాగా రాయగలను అనే ఒక నమ్మకాన్ని నాకు కలిగించి ఆ రూట్లో నేను ముందుకు వెళ్లడానికి కారణమే వాడు. అలాంటి మిత్రుడిని కోల్పోయిన నాకు, కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది" అని చెప్పారు.