కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకున్న జేఈఈ అభ్యర్థి
- 12 తరగతి చదువుతూ జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి
- ఉదయం కుమారుడి నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు
- వార్డెన్‌కు ఫోన్ చేయడంతో విషాదం వెలుగులోకి
12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి తాజగా తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసే కుమారుడి నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో అనుమానించి, వార్డెన్‌కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వార్డెన్ వెళ్లి చూస్తే విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టానికి తరలించారు.