‘ఓం’ అని ఉన్న జెండాను అవమానించాడంటూ ముస్లిం యువకుడిపై దాడి

‘ఓం’ అని ఉన్న జెండాను అవమానించాడంటూ ముస్లిం యువకుడిపై దాడి

Telangana Muslim man insults saffron flag in reel thrashed paraded naked
  • మెదక్ జిల్లాలో ఘటన
  • కాషాయ జెండాను నిందితుడు అవమానిస్తున్నట్టు ఉన్న వీడియో నెట్టింట వైరల్
  • యువకుడికి దేహశుద్ధి చేసి నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
‘ఓం’ అని రాసున్న కాషాయ జెండాను అవమానించాడంటూ ఓ ముస్లిం యువకుడిని కొట్టి, నగ్నంగా ఊరేగించిన ఘటన మెదక్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంది. కాషాయ జెండాను ఆ యువకుడు అవమానించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కొందరు.. యువకుడికి దేహశుద్ధి చేసి నగ్నంగా ఊరేగించారు. 

హిందువుల మనోభావాలు దెబ్బతీశాడంటూ గ్రామస్తులు ఆ తరువాత యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), 295-ఏ, 505(2) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, యువకుడు కూడా గ్రామస్తులపై ఫిర్యాదు చేశాడు. తనపై వారు దాడి చేశారని ఆరోపించాడు. దీంతో, పోలీసులు.. బాధ్యులపై ఐపీసీ 341, 323, 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Medak District
Telangana

More Telugu News