అత్తారింట్లో ఎలా ఉందో చెప్పిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi about her new family
  • మెగా కోడలు అనే ట్యాగ్ చాలా ప్రత్యేకంగా ఉందన్న లావణ్య
  • సినిమాల విషయంలో అత్తారింట్లో కండిషన్లు పెట్టలేదని వెల్లడి
  • మంచి కథ దొరికితే వరుణ్ తో కలిసి నటిస్తానని వ్యాఖ్య
ఉత్తరాఖండ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్థిరపడిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను పెళ్లాడి మెగా కోడలుగా మారారు. మెగా ఫ్యామిలీలో ఆమె చాలా సంతోషంగా ఉంటున్నారు. మరోవైపు ఆమె తాజాగా 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేశారు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 

లావణ్య త్రిపాఠి అనేది తాను కష్టపడి సంపాదించుకున్న పేరు అని... మెగా కోడలు అనే ట్యాగ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. వరుణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఈ ట్యాగ్ వచ్చిందని అన్నారు. ఈ పిలుపు చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పారు. పర్ఫెక్షన్ అనేది పెద్ద సమస్య అని... దీని వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని... వరుణ్ మాత్రం పర్ఫెక్షనిస్ట్ అని చెప్పారు. 

పెళ్లి అయిన తర్వాత తన సినిమాల విషయంలో అత్తారింట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని లావణ్య తెలిపారు. ఇలాంటి పాత్రలు చేయవద్దని కూడా ఎవరూ తనతో అనలేదని చెప్పారు. కెరీర్ పరంగా అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని తెలిపారు. మంచి కథ దొరికితే వరణ్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధమని చెప్పారు.
Go Back to Shorts
Lavanya Tripathi
Varun Tej
Tollywood

More Telugu News