తగ్గేదే లే... లోక్ సభ ఎన్నికల బరిలో బర్రెలక్క
- బర్రెలక్కగా పాప్యులరైన శిరీష
- అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ
- ఓటమిపాలైన వైనం
- ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తానని వెల్లడి
ఇక అసలు విషయానికొస్తే... అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క తగ్గేదే లే అంటోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని సమరోత్సాహం ప్రదర్శిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన బర్రెలక్క... లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు తనను మరింత దృఢంగా మార్చాయని పేర్కొంది. ఓటుకు నోటు అనే విధానాన్ని రూపు మాపడంపై కృషి చేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని బర్రెలక్క చెప్పింది.