బిర్యానీ బాగాలేదన్న కస్టమర్లు... ముదిరిన గొడవ... కర్రలతో చితక్కొట్టిన హోటల్ సిబ్బంది... ఇదిగో వీడియో

బిర్యానీ బాగాలేదన్న కస్టమర్లు... ముదిరిన గొడవ... కర్రలతో చితక్కొట్టిన హోటల్ సిబ్బంది... ఇదిగో వీడియో

Hotel waiters beat up customers with sticks
  • నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అబిడ్స్‌లోని హోటల్‌కు వెళ్లిన కుటుంబం
  • తాము ఆర్డర్ చేసిన బిర్యానీ బాగా లేదని... హోటల్ సిబ్బందికి ఫిర్యాదు
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం... ముదిరిన గొడవ
బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన కస్టమర్లను కొట్టిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి ఓ కుటుంబం అబిడ్స్‌లోని రెస్టారెంట్‌కు వెళ్లింది. మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు హోటల్‌కు వెళ్లి... బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ వారు ఆర్డర్ చేసిన బిర్యానీ సరిగ్గా ఉడకలేదు. దీంతో తమకు సర్వ్ చేసిన బిర్యానీ బాగా లేదని ఆ ఫ్యామిలీ... హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదన జరిగింది. బిల్లు కట్టే సమయంలో గొడవ ముదిరింది. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది... ఆ ఫ్యామిలీపై కర్రలతో దాడి చేశారు. కొంతమంది వెయిటర్లు తమకు దొరికిన వస్తువులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి దృశ్యాలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఈ ఘటనకు సంబంధించి సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
hotel
Hyderabad
Telangana

More Telugu News