బైబై.. పాకిస్థాన్: సెహ్వాగ్ వ్యంగ్యం

Bye bye Pakistan tweets Sehwag
  • ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
  • పాకిస్థాన్ కు దాదాపుగా మూసుకుపోయిన అవకాశాలు
  • ఇక ఇంటికి బయల్దేరు పాకిస్థాన్ అంటూ సెహ్వాగ్ సెటైర్లు
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ విజయాన్ని నమోదు చేసి నాలుగో బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ కు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే... ఇంగ్లాండ్ తో జరిగే చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాలి. ఒక వేళ ఛేజింగ్ చేస్తే 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. ఈ సమీకరణాల నేపథ్యంలో పాక్ సమీస్ కు చేరడం అసంభవం అనే చెప్పొచ్చు

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. 'లాంగ్ లివ్ పాకిస్థాన్. ఇక ఇంటికి బయల్దేరు.. బైబై పాకిస్థాన్' అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Virender Sehwag
Team India
Pakistan
ODI World Cup

More Telugu News