కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం
- ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల సహిత సుబ్రమణ్యేశ్వర స్వామి యాగం చేపట్టిన కేసీఆర్
- శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు కొనసాగిన యాగం
- మహా పూర్ణాహుతితో నేడు ముగిసిన యాగ క్రతువు
తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించినట్లు శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకున్నారన్నారు. సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేశామన్నారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందన్నారు. మహా పూర్ణాహుతి అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్ దంపతులపై చల్లారు. యాగ భస్మాన్ని కేసీఆర్ నుదుట దిద్దారు.