Advertisement

ఈటల రాజేందర్ గెలవాలని, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని ప్రజలు అంటున్నారు: ఈటల జమున

Etala Rajender wife Jamuna campaign in Huzurabad
  • హుజూరాబాద్ ప్రజలు ఈటలకు తప్ప మరో పార్టీకి ఓటు వేసే అవకాశం లేదన్న జమున 
  • హుజూరాబాద్, గజ్వేల్.. ఈ రెండూ ఈటలకు రెండు కళ్లు అని వ్యాఖ్య 
  • అందుకే ఈటలను ఏడుసార్లు గెలిపించారని వెల్లడి   
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్‌కు తప్ప మరో పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదని ఆయన భార్య ఈటల జమున అన్నారు. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కష్టసుఖాల్లో ఆదుకున్న ఈటలకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారన్నారు. అందరూ కూడా ఈటలను ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం సంతోషంగా ఉందన్నారు. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీ చేస్తానన్న ఈటలకు ఈ రెండు నియోజకవర్గాలు రెండు కళ్లలాంటివన్నారు.

మా సారు గెలవాలే... ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనేది ప్రజల నినాదంగా ఉందన్నారు. ఈటల రాజేందర్ ఇక్కడ నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ కష్టసుఖాల్లో వారికి తోడుగా ఉన్నానని చెప్పారు. మేమంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఇష్టమని, వారంటే మాకు ఇష్టమన్నారు. అందుకే ఈటలను ఏడుసార్లు గెలిపించినట్లు చెప్పారు. ఉప ఎన్నిక విజయమే... డిసెంబర్ 3న రిపీట్ అవుతుందన్నారు.
Advertisement
Etela Rajender
jamuna
Huzurabad
Telangana Assembly Election
BJP

More Telugu News