Advertisement

బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందంటూ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం

Ponnala fires at congress over bc issue
  • కాంగ్రెస్ ఎప్పుడూ కనీసం 50 శాతం ప్రజల మద్దతు తెచ్చుకోలేకపోయిందన్న పొన్నాల 
  • కాంగ్రెస్‌లో వెనుకబడిన వర్గాలు గెలవలేకపోతున్నారని విమర్శ
  • బీసీలకు బీఆర్ఎస్సే టిక్కెట్లు ఇస్తోందన్న పొన్నాల  
మాజీ మంత్రి, ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా ఎప్పుడూ 50 శాతం ప్రజల మద్దతును కూడబెట్టుకోలేకపోయిందన్నారు. బీసీలను పక్కన పెడుతుండటం వల్లే గత ఎన్నికల్లో 50 శాతం సీట్లు, ఓట్లను సాధించలేదన్నారు. కాంగ్రెస్‌లో వెనకబడిన వర్గాలు గెలవలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని, బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నది కేవలం బీఆర్ఎస్‌ పార్టీయే అన్నారు. సర్వేలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీసీలపై ప్రయోగాలు చేస్తోందన్నారు. 40 శాతం బీసీలు ఉన్నప్పుడే మొత్తం 50 శాతం సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలేనని, మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతారన్నారు.
Advertisement
Ponnala Lakshmaiah
BRS
Congress
Telangana Assembly Election

More Telugu News