విమర్శించడం చాలా సులభం.. ఎవరైనా అది చేయగలరంటున్న పాక్ వైస్ కెప్టెన్
- సౌతాఫ్రికాతో నేడు చెపాక్ లో తలపడనున్న పాకిస్థాన్
- దాయాది జట్టుకు ఇది చావో రేవో తేల్చుకునే మ్యాచ్
- ఈ మ్యాచ్ లో ఓడితే వరల్డ్ కప్ టోర్నీ నుంచి బాబర్ సేన ఇంటికే..
సౌతాఫ్రికాతో మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఆడే ముందు జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని షాదాబ్ పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పరిస్థితి తమకు కొత్త కాదని, గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని అద్భుత ప్రదర్శన చేశామని ఆయన గుర్తుచేశారు. సౌతాఫ్రికాతో మ్యాచ్ విషయంలో తాము కొత్తగా కోల్పోయేదేమీ ఉండదనే ఆలోచనతోనే బరిలోకి దిగుతామని వివరించారు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్రపంచ కప్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వస్తుందనేది జట్టులోని ప్రతీ ఆటగాడికీ తెలుసని, గెలవడం తప్ప తమ ముందు మరో మార్గంలేదని గుర్తించామని షాదాబ్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగే మ్యాచ్ లో తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని షాదాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు.