తెలంగాణ బీజేపీకి మరో షాక్.. సొంతగూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- బీజేపీలో ముగిసిన రాజగోపాల్ 15 నెలల ప్రస్థానం
- బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయిందన్న నేత
- కేసీఆర్ చెర నుంచి రాష్ట్రాన్ని విడిపించాలన్న ఆశయంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటన
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కినుక వహించిన రాజగోపాల్‌రెడ్డి 15 నెలల క్రితం మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిరుడు అక్టోబర్‌లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడం, కాంగ్రెస్ బలం పెరుగుతుండడంతో ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. నియంత కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్న తనను ప్రజలు ఆదరించాలని కోరుతూ ఓ లేఖ విడుదల చేశారు.