రూ. 13 వేలకు అమ్మేసిన మాస్కుకు వేలంలో రూ. 36 కోట్ల ధర.. ఆర్ట్ డీలర్‌పై కోర్టుకెక్కిన వృద్ధ దంపతులు
- ఫ్రాన్స్‌లోని నిమెస్‌లో ఘటన
- ఇల్లు శుభ్రం చేస్తుండగా కనిపించిన మాస్క్
- అసలు ధర దాచిపెట్టి చౌకగా కొట్టేశాడంటూ కోర్టులో దావా వేసిన వృద్ధ దంపతులు
- ఆ మాస్క్ గాబన్‌లోని ఫాంగ్ ప్రజలకు చెందినదిగా గుర్తింపు
- 19వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన మాస్క్
న్యూస్ పేపర్ల ద్వారా విషయం తెలిసిన వృద్ధ దంపతులు ఆర్ట్ డీలర్‌పై కోర్టుకెక్కారు. తాము విక్రయించిన మాస్క్ అసలు ధరను కావాలనే దాచిపెట్టి తనను మోసం చేశాడని దావా వేశారు. ‘ది మెట్రో న్యూస్’ ప్రకారం.. ఈ మాస్కును గాబన్‌లోని ఫాంగ్ ప్రజలకు చెందినది. వివాహాలు, అంత్యక్రియల సమయంలో దీనిని వారు ఉపయోగిస్తారు. ఈ మాస్కులు అత్యంత అరుదైనవి.
ప్రపంచవ్యాప్తంగా మ్యూజియాలలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది 19వ శతాబ్దానికి చెందినదని, ఇవి అత్యంత అరుదైన, అసాధారణమైనవని కోర్టు పేర్కొంది. ‘ఇండస్ట్రీ మీడియా’ ప్రకారం.. వృద్ధ దంపతుల్లోని మహిళ భర్త తాత ఆఫ్రికాలోని కలోనియల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన నుంచే అది వీరికి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.