సిక్కిం వరదల్లో ‘దాన వీర శూర కర్ణ’ నటి గల్లంతు
- ఎన్టీఆర్ మూవీ 'దాన వీర శూర కర్ణ'లో నటించిన సరళకుమారి
- సిక్కిం వరదల తర్వాత తప్పిపోయిన సరళ కుమారి
- స్నేహితులతో కలసి ఈ నెల 2న సిక్కిం పర్యటన
- కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన ఆమె కుమార్తె నబిత
చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్ లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత వెల్లడించారు. ‘‘వరదలు వచ్చినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాను. ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ కలవడం లేదు’’ అని నబిత ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. సరళ కుమారి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ 'దాన వీర శూర కర్ణ'లో నటించారు. 'సంఘర్షణ' తదితర సినిమాల్లోనూ నటించారు.