గాయాలు తగిలిన ఫొటోలను షేర్ చేసిన పూజా హెగ్డే.. ఆందోళనలో ఫ్యాన్స్!
- పూజా హెగ్డే కాలికి గాయాలు
- చర్మం కందిపోయిన ఫొటోలను షేర్ చేసిన పూజా
- యుద్ధపు గాయాలు అంటూ క్యాప్షన్ పెట్టిన బుట్టబొమ్మ
సినిమాల విషయానికి వస్తే వరుస హిట్లతో ఒక వెలుగు వెలిగిన పూజాకు... ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. కొత్తగా ఆఫర్స్ రాకపోగా... ఉన్న ఆఫర్స్ కూడా చేజారుతున్నాయి. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమాలో ఆమె క్యారెక్టర్ ను తగ్గించి, ఆమెను సెకండ్ హీరోయిన్ స్థాయికి తగ్గించేశారట. దీంతో, తాను తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేసి, ఆ సినిమాకు పూజా గుడ్ బై చెప్పేసింది. 'జనగణమన' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఆమె చేజారింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కాల్సిన చిత్రం నిర్మాతలు తప్పుకోవడంతో నిలిచిపోయింది.