కేక్ తినేశానంటూ ఇన్ స్టాలో ఫొటో పెట్టిన అనుష్క.. కోహ్లీ రియాక్షన్ ఇదే!
- నా కేక్ కూడా నువ్వే తిన్నావంటూ కోహ్లీ కామెంట్
- అలిగి కూర్చున్నావు కాబట్టే మొత్తం నేనే తినేశానని అనుష్క ఫన్నీ రిప్లై
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
ఓ కంపెనీ ప్రచారంలో భాగంగా కేక్ అంటిన చేతులు, అద్భుతంగా ఉందనే ఎక్స్ ప్రెషన్స్ తో అనుష్క ఓ ఫొటో షేర్ చేసింది. ఇప్పుడే కేక్ తిన్నాననే అర్థం వచ్చేలా ఉన్న ఆ ఫొటోకు కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. నా కేక్ కూడా నువ్వే తినేశావంటూ అనుష్కపై ఆరోపణలు చేశాడు. దీనికి జవాబుగా.. ‘నువ్వే అలిగి కూర్చున్నావు నేనేం చేసేది.. అందుకే కేక్ మొత్తం తినేశా’ అంటూ అనుష్క కామెంట్ పెట్టింది. కాగా, ఈ జంట ఇటీవల వినాయక చవితి సంబరాల్లో పాల్గొన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.